తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కూడా చూపలేదు: కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎంపీ నామా
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం సరైన నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయమై పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కూడ చూపడం లేదని ఈ బడ్జెట్ తో తేటతెల్లమైందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర బడ్జెట్ 2023పై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ గా ఆయన పేర్కొన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్ లో పోరాటం చేస్తామని నామా నాగేశ్వరరావు ప్రకటించారు.