Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ జి వెల్ కమ్... అంకాపూర్ చికెన్ రుచిచూసి వెళ్ళిపొండే..: కవిత సెటైర్లు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చురకలు అంటించారు.  

BRS MLC Kavitha satires on Congress leader Rahul Gandhi AKP
Author
First Published Oct 18, 2023, 1:26 PM IST

నిజామాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కోసం డిల్లీ నుండి తెలంగాణ బాట పట్టిన జాతీయ పార్టీల నాయకులకు బిఆర్ఎస్ నేతలు చురకలు అంటిస్తున్నారు. ఇలా ఇవాళ తెలంగాణకు విచ్చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చురకలు అంటించారు. 

ఇంతకాలం తెలంగాణ అభివృద్ది, ప్రజా సంక్షేమంతో బిఆర్ఎస్ మరింత బలపడిందని... ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ, ఇప్పుడు రాహుల్ నిజామాబాద్ లో ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. 

అయితే తెలంగాణలో ఎన్నికలు వున్నాయనే పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని కవిత ఎద్దేవా చేసారు. వీరిని రావద్దని అనను... టూరిస్టులుగా రావొచ్చు, వెళ్లొచ్చని అన్నారు. రాహుల్ కూడా ఇక్కడి ప్రదేశాలను చూడొచ్చు... అంకాపూర్ చికెన్ తినొచ్చు అని అన్నారు. అంతేతప్ప తమ రాజకీయాల కోసం ప్రశాంతంగా వున్న తెలంగాణలో చిచ్చు పెట్టొద్దని అన్నారు. 

Read More  నిన్ను ‘కుక్కా’ అన్నా సింపతీ రాదు.. కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి రాహుల్ వెళుతున్నాడని... అందువల్లే ఆయన తన పేరును ఎన్నికల గాంధీగా పెట్టుకుంటే బావుంటుందని కవిత ఎద్దేవా చేసారు. తమ రాజకీయాల కోసం బిజెపిని కాంగ్రెస్ ఒక మాట అనడం... తిరిగి వాళ్ళు వీరిని ఒక మాట అనడం... రెండుపార్టీలు కలిసి తెలంగాణలో సామరస్యాన్ని దెబ్బతీస్తారని అన్నారు. గత పదేళ్ళుగా ఎంతో ప్రశాంతంగ వున్న రాష్ట్రంలో అలజడి సృష్టించవద్దని కవిత అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios