Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం: వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు కవిత, ఫోన్లను మీడియాకు చూపిన ఎమ్మెల్సీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఇవాళ  విచారణకు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  బయలుదేారు.  తాను గతంలో  ఉపయోగించిన  ఫోన్లను  కవిత  ఫోన్లను  మీడియాకు  చూపారు.  

BRS  MLC  Kalvakuntla  Kavitha  Show Mobile Phones  To  Media Before  ED Investigation lns
Author
First Published Mar 21, 2023, 11:31 AM IST

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  మంగళవారంనాడు  ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు వెళ్లేముందు  తాను ఉపయోగించిన  సెల్ ఫోన్లను  కవిత  మీడియాకు  చూపారు. వరుసగా  రెండో  రోజూ  ఈడీ విచారణకు  కవిత  హాజరయ్యారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  నిన్న కూడా ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. నిన్న  సుమారు  పదిన్నర గంటల పాటు  కవితను  ఈడీ అధికారులు విచారించారు.  ఇవాళ కూడా  విచారణకు  రావాలని ఈడీ అధికారులు  ఆదేశించారు. దీంతో  ఇవాళ కూడా  కవిత  ఈడీ విచారణకు హాజరయ్యారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  ఈ నెల 11వ తేదీన  కవిత  ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల  20వ తేదీన  రెండో సారి  ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కవిత.  ఇవాళ  మూడో రోజున  కవిత  విచారణకు  హాజరయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మంత్రి  శ్రీనివాస్ గౌడ్, కవిత  భర్త అనిల్,  బీఆర్ఎస్  ప్రధాన కార్యదర్శి  సోమా భరత్ కూడా  ఈడీ కార్యాలయానికి  చేరుకున్నారు. కవిత  ఈడీ కార్యాలయం  లోపలికి  వెళ్లిన   కొద్దిసేపటి తర్వాత   వీరంతా తిరిగి  కేసీఆర్  అధికారిక నివాసానికి వెళ్లిపోయారు. 

ఈ నెల 6వ తేదీన  అరుణ్ రామచంద్రపిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.  అరుణ్ రామచంద్రపిళ్లై ఇచ్చిన వాంగ్మూలం మేరకు  కవితకు  ఈడీ అధికారులు  నోటీసులు ఇచ్చారు. ఈ నెల  9వ తేదీన విచారణకు  రావాలని  ఈడీ అధికారులు కవితకు  నోటీసులు  ఇచ్చారు.  అయితే  ముందుగా  నిర్ణయించిన  కార్యక్రమాలున్నందున  ఈ నెల  9న    ఈడీ విచారణకు  రాలేనని  కవిత  ఈడీకి  లేఖ రాశారు.   మరో రోజున ఈడీ విచారణకు  వస్తానని  కవిత  ఈడీకి   లేఖ  రాశారు.  ఈ నెల  11వ తేదీన  తొలిసారిగా  కవిత  ఈడీ విచారణకు  హాజరయ్యారు.   ఈ నెల  16వ తేదీన  రెండోసారి  విచారణకు  రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే  ఈ నెల  16న  కవిత  ఈడీ విచారణకు హాజరు కాలేదు.  తన  ప్రతినిధి సోమా భరత్ ద్వారా  లేఖను  కవిత  పంపారు. 

ఈడీ విచారణపై  సుప్రీంకోర్టును  ఆశ్రయించారు  కవిత.  ఈ నెల  24న   ఈ పిటిషన్ పై విచారణ  చేయనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.   సుప్రీంకోర్టు  తీర్పు  తర్వాత  విచారణకు హాజరౌతానని  కవిత ఈడీకి  రాసిన  లేఖలో  పేర్కొన్నారు.  కానీ ఈ నెల  20న విచారణకు రావాలని  కవితకు  ఈడీ  నోటీసులు ఇచ్చింది.  దీంతో  ఆమె   నిన్న  విచారణకు  హాజరయ్యారు.  ఇవాళ కూడా విచారణకు  వెళ్లారు.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: న్యాయ నిపుణులతో కవిత భేటీ

ఈడీ విచారణకు  వెళ్లడానికి ముందు  సుప్రీంకోర్టు  సీనియర్ కౌన్సిల్  తో  కవిత   సమావేశమ య్యారు.  ఈ సమావేశం  ముగిసిన తర్వాత  కవిత  బీఆర్ఎస్ లీగల్  సెల్  ప్రతినిధులతో  కవిత  చర్చించారు.  అనంతరం  ఆమె  ఈడీ విచారణకు వెళ్లారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios