బీజేపీ నేతలు చెప్పినట్టు అరెస్టులా? ఢిల్లీ లిక్కర్ స్కాంపై కవిత

బీజేపీ నేతలు చెప్పినట్టుగా దర్యాప్తు  సంస్థలు  వింటే  ఎలా అని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. 
 

BRS MLC kalvakuntla kavitha Reacts on BJP comments over Delhi liquor scam

హైదరాబాద్:   ఢిల్లీ  లిక్కర్ స్కాంలో  బీజేపీ  నేతలు  చెప్పినట్టు అరెస్ట్ లు చేస్తే  ఎలా అని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత ప్రశ్నించారు. గురువారంనాడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.   ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత కూడా అరెస్ట్ అవుతారని  బీజేపీ నేతలు  చేసిన వ్యాఖ్యలను  మీడియా ప్రతినిధులు  ప్రస్తావించగా  ఆమె  స్పందించారు. 

ఏఏ దర్యాప్తు  సంస్థలు  ఎప్పుడు ఎవరిని అరెస్ట్  చేయాలని  చెబుతారా అని  ఆమె బీజేపీని ప్రశ్నించారు.ఇలా  వ్యాఖ్యలు  చేయడం సరైంది కాదని  కవిత  చెప్పారు.   ఈ రకమైన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు  చెప్పినట్టుగా దర్యాప్తు సంస్థలు నడుచుకుంటున్నట్టుగా బయటపడుతుందని  ఆమె అభిప్రాయపడ్డారు. దర్యాప్తు సంస్థలతో  బీజేపీ  మ్యాచ్ ఫిక్సింగ్ కు ఈ వ్యాఖ్యలు   అద్దం పడుతున్నాయని ఆమె  చెప్పారు. అదానీపై ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు  జరగడం లేదని  ఆమె ప్రశ్నించారు.  ఎవరు  ఎప్పుడు అరెస్ట్  అవుతారో  చెప్పకూడదని బీజేపీ నేతలకు  చెప్పాలని  ఆమె  మీడియా ప్రతినిధులను  కోరారు. 

ఈ విషయమై  ఏం జరుగుతుందో  చూద్దామన్నారు.  ఈ కేసులో  ఏం జరుగుతుందో   దర్యాప్తు సంస్థలు  చెప్పాలని కవిత  కోరారు.  ఈ రకంగా మాట్లాడితే  మర్యాదగా ఉండదని ఆమె బీజేపీ నేతలను హెచ్చరించారు. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం : ఐదుగురు నిందితులకు బెయిల్..ఎవరెవరంటే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండో చార్జీషీట్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేరును కూడా   అధికారులు చేర్చారు. కవితతో పాటు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  పేరు కూడా చార్జీషీట్ లో  ఉంది.  ఈ చార్జీషీట్ ను తప్పుల తడకగా   అరవింద్  కేజ్రీవాల్  పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో  ఢిల్లీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియా ను  ఇటీవలనే  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.  మనీష్ సిసోడియా అరెస్ట్  తర్వాత    తెలంగాణ రాష్ట్రానికి  చెందిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత కూడా అరెస్ట్ అవుతారని  బీజేపీ  నేతలు  చెబుతున్నార. మీడియా సమావేశాల్లో  ఈ వ్యాఖ్యలు  చేస్తున్నారు. బీజేపీ  నేతలు వివేక్ , బండి సంజయ్ వంటి నేతలు   కవిత కూడా అరెస్ట్  అవుతారని  వ్యాఖ్యలు  చేసిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండో చార్జీసీట్  దాఖలు  చేసిన తర్వాత  ఏపీ రాష్ట్రానికి  చెందిన  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు  రాఘవరెడ్డిని  దర్యాప్తు  అధికారులు గత మాసంలో  అరెస్ట్  చేశారు రాఘవరెడ్డి అరెస్ట్  తర్వాత  మనీష్ సిసోడియా  అరెస్ట్  జరిగింది. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios