మాజీ మంత్రి జోగు రామన్న ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.  

ముంబై : అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మహారాష్ట్రలో వున్న రామన్న హైవేపై కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఎమ్మెల్యే కారుకు ఒక్కసారిగా ఎడ్ల బండి అడ్డురావడంతో డ్రైవర్ తప్పించబోయాడు.దీంతో కారు అదేవేగంతో దూసుకెళ్లి డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. దీంతో కారులోనే వున్న ఎమ్మెల్యే జోగు రామన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేష్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. పండ్రకవడ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వీరి కారుకు ఎడ్లబండి అడ్డురావడంతో తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టారు. 

ఈ ప్రమాదంలో మాజీ మంత్రికి స్వల్వ గాయాలయ్యాయి. అయితే గాయాలు చిన్నవే కావడంతో జోగు రామన్న మరో వాహనంలో నాగ్ పూర్ బయలుదేరారు. ఆయన వెంట ఎంపీ నగేష్, ఇతర నాయకులు కూడా వెళ్ళారు.