Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మంలో వేడేక్కిన రాజకీయం: పోటాపోటీగా బీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన  బీఆర్ఎస్ నేతలు  ఇవాళ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ  ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.  ఒకే రోజున తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కందాల శ్రీనివాస్ రెడ్డి  ఈ సమావేశాలు నిర్వహించడం  ప్రాధాన్యత సంతరించుకుంది.

 BRS  Leaders To Conduct athmeeya sammelanam in Khammam
Author
First Published Jan 1, 2023, 10:31 AM IST

ఖమ్మం:  కొత్త సంవత్సరం వేళ బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు నేతల నుండి ఆత్మీయ సమావేశాలకు పార్టీ శ్రేణులకు  ఆహ్వానాలు  అందాయి. అయితే  ఎవరి సమావేశానికి వెళ్లాలనే విషయమై పార్టీ క్యాడర్  అయోమయంలో  ఉంది. ఒకే రోజున  ముగ్గురు నేతలు  సమావేశం  నిర్వహించడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ముగ్గురు నేతలు  ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సమ్మేళనాలకు  పూనుకున్నారు. 

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  ప్రస్తుతం  కందాల ఉపేందర్ రెడ్డి  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో  ఉపేందర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత  రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉపేందర్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో చేరారు.  గత ఎన్నికల్లో  అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు.  కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో  తుమ్మల నాగేశ్వరరరావు , ఉపేందర్ రెడ్డి వర్గాల మధ్య పొసగడం లేదు.సిట్టింగ్  ఎమ్మెల్యేలకు  వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని  తెలంగాణ సీఎం కేసీఆ,ర్  గత ఏడాది పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ప్రకటించారు.  దీంతో  కందాల ఉపేందర్ రెడ్డి టికెట్ పై ధీమాగా  ఉన్నారు.   దీంతో ఇశాళ ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి  ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. 

మరో వైపు పాలేరు నుండి  వచ్చే ఎన్నికల్లో  పోటీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రంగం సిద్దం చేసుకుంటున్నారు. గత ఏడాదిలో  జిల్లా వ్యాప్తంగా  ఉన్న అనుచరులతో  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  పార్టీ నేతలతో  తుమ్మల నాగేశ్వరరావు  తరచుగా సమావేశమౌతున్నారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన నేతలతో  కూడా  సమావేశం నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని  ఇవాళ  తన స్వగ్రామం బారెగూడెంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి  రావాలని  పార్టీ క్యాడర్  కు ఆహ్వానాలు పంపారు. ఖమ్మం మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా  ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.  ఈ సమావేశానికి రావాలని  ఆహ్వానాలు పంపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  మూడు  జనరల్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఇటీవల ప్రకటించారు.

ఈ తరుణంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కూడా ఆత్మీయసమ్మేళం నిర్వహించడం  ప్రాధాన్యత సంతరించుకుంది.  2014 ఎన్నికల్లో  ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  వైసీపీ అభ్యర్ధిగా  ఆయన  విజయం సాధించారు. ఆ తర్వాత  ఆయన  బీఆర్ఎస్ లో చేరారు.  2019 ఎన్నికల్లో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ా పార్టీ టికెట్ ను కేటాయించలేదు.  టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్  కేటాయించింది. అయితే  వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా  పోటీ చేయాలని  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  రంగం సిద్దం  చేసుకుంటున్నారు.పాలేరు నుండి  పోటీ చేసేందుకు  కూడా ఆయన ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

అయితే ఇదే స్థానం నుండి వైఎస్ షర్మిల వైఎస్ఆర్‌టీపీ నుండి  పోటీకి  ప్లాన్ చేసుకుంటున్నారు. వైఎస్ కుటుంబంతో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. షర్మిల ఈ స్థానం నుండి  పోటీ చేస్తే  శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అనే చర్చ కూడా లేకపోలేదు.ఈ తరుణంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కొత్త సంవత్సరం వేళ ముగ్గురు నేతల నుండి ఆత్మీయ సమ్మేళనాలకు  ఆహ్వానాలు రావడంతో   ఆ పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios