Asianet News TeluguAsianet News Telugu

రాజాసింగ్ ఎన్నిక చెల్లదు.. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత పిటిషన్

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ బీఆర్ఎస్ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

brs leader prem singh rathore moved to supreme court on goshamahal mla raja singh
Author
First Published Jan 11, 2023, 3:49 PM IST

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్. అఫిడవిట్‌లో పూర్తి సమాచారం ఇవ్వలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గతంలో రాజాసింగ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది  హైకోర్టు. తాజాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రేమ్‌సింగ్ రాథోడ్. 

Also Read: హిందూ ధర్మం కోసం తూటాలకైనా ఎదురెళ్తా : పోలీసులు కేసు పెట్టడంపై రాజాసింగ్ వ్యాఖ్యలు

కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన రాజాసింగ్.. తన ఎన్నికల అఫిడవిట్‌లో తన క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని రాథోడ్ గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ వి రామ సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ వి రామ సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం 2018లో ముందస్తు ఎన్నికలు వచ్చాయని, అలాగే అక్కడ జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించించారు. ఈ కేసును విచారించాలంటే కూడా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలేమోనంటూ న్యాయమూర్తి వ్యంగ్యస్త్రాలు సంధించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios