బోధన్ లో మైనర్ బాలిక మీద బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తమ్ముడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి మరీ దారుణానికి ఒడిగట్టాడు.
బోధన్ : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 13 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ నాయకుడు రవి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను బలవంతంగా ఓ షెడ్యూల్లోకి లాక్కెళ్ళి దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది.
రవి బోధన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ సోదరుడు..కూతురు మీద లైంగిక దాడి విషయం తెలియడంతో.. బాధితురాలి తల్లి స్థానిక మైనార్టీ నాయకులను ఆశ్రయించింది. తల్లి ఇచ్చిన సమాచారం మేరకు వారు ఘటన గురించి పోలీసులకు తెలియజేశారు. నిందితుడు, నిందితుడు సోదరుడైన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ కూడా ఘటన గురించి ఎవరికి చెప్పొద్దని బెదిరించారని స్థానికులు ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతను చంపిన నక్సలైట్లు.. మృతదేహంపై హెచ్చరిక నోట్
ఈ నేపథ్యంలో నిందితుడితో పాటు రాధాకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిండితుడైన రవి మీద ఫోక్సో చట్టం, అత్యాచారాల నేరాల కింద కేసులు నమోదు చేశారు. అతని సోదరుడైన బిఆర్ఎస్ నేత రాధాకృష్ణ మీద కూడా బెదిరింపులకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఈ వివరాలను సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. అత్యాచార బాధిత కుటుంబాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ దంపతులు కలిసి, పరామర్శించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే భార్య తన వాహనంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాలికను బలవంతంగా షెడ్డులోకి లాకెళ్లిన రవి బాలిక కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి.. ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన రవికి, అతనికి సపోర్ట్ చేసిన సోదరుడు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని షకీల్ ప్రకటించారు. ఫ్లోర్ లీడర్ హోదా నుంచి కూడా రాధాకృష్ణను తప్పించినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు.
