అక్టోబర్ 16న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  ఆరోజున వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని.. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు.  

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగా లేని ఏడుగురు సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. అలాగే అక్టోబర్ 16న వరంగల్ భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజున మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని సీఎం తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పరిస్ధితులను బట్టి అభ్యర్ధులును మారుస్తామని.. ఈ విధంగానే ఏడు చోట్ల మార్పులు జరిగాయని కేసీఆర్ వెల్లడించారు. నాలుగు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి వుందని సీఎం పేర్కొన్నారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు.