టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం: ఈసీని కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  చేసిన తీర్మానం కాపీని ఈసీకి అందించనుంది బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. రేపు ఉదయం 11 గంటలకు ఈసీ అధికారులకు ఈ తీర్మానం కాపీని అందించనున్నారు.

BRS Delegates leaves For Delhi To Submit TRS Name Change Resolution


హైదరాబాద్:టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఇవాళ చేసిన తీర్మానం కాపీని ఈసీకి సమర్పించేందుకు టీఆర్ఎస్ ప్రతినిధి బృందం  ఢిల్లీకి  బుధవారం నాడు బయలుదేరింది.  మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో  టీఆర్ఎస్ బృందం ఢిల్లీకి వెళ్లింది.  రేపు ఈసీకి  టీఆర్ఎస్ ప్రతినిధి బృందం  తీర్మానం కాపీని అందించనుంది.  

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగు పెట్టనున్నందున  టీఆర్ఎస్  పేరును  భారత రాష్ట్ర సమితిగా మార్చాలని   నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం మేరకు ఇవాళ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకవాక్య తీర్మానాన్ని  సమావేశం ఏకగ్రీవంగా  ఆమోదించింది.  ఈ సమావేశంలో పాల్గొన్న 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానాన్నిఆమోదిస్తూ  సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్నిసమావేశంలో కేసీఆర్ చదివి విన్పించారు.

ఈ తీర్మానం కాపీతో బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో  మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈసీ అధికారులను కలిసి తీర్మానం కాపీని అందించనున్నారు. 

2024 ఎన్నికల్లో దేశంలోని పలు చోట్ల కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో తమతో మిత్రులుగా ఉన్న పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉంది. 

also read:న్యూఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీస్: స్వంత భవన పనులు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ప్రకటించిన తర్వాత మహారాష్ట్ర నుండి కేసీఆర్ తన దేశ వ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు. 2023 లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.కర్ణాటకలో తమ మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేయనుంది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి  రాకుండా నిలువరించేందుకు బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఏర్పాటు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  బీజేపీ,కాంగ్రెసేతర పార్టీలతో కేసీఆర్ చర్చలు  జరుపుతున్నారు.  గతంలోనే  పలు రాష్ట్రాల సీఎంలతో  కేసీఆఆర్ చర్చించారు. రానున్న రోజుల్లో కూడా ఈ చర్చలు కొనసాగనున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios