సెప్టెంబర్ 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ప్రత్యేక సమావేశాలపై ఎంపీలకు దిశా నిర్దేశం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజురుకానున్న బీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో.. స్పెషల్ సెషన్‌కు సంబంధించి పార్టీ అజెండాతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించనున్నారు.ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు.
Also Read: కీలక నిర్ణయం .. 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా- సెప్టెంబర్ 17'
Also Read: టీ బీజేపీలో టికెట్ల కోసం దరఖాస్తు చేయని ముఖ్య నాయకులు.. నేతల తీరుపై క్యాడర్‌లో అసంతృప్తి!
అయితే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం పేరు మార్పు (ఇండియా నుంచి భారత్‌కు)తో పాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. చట్టసభల్లో మహిళ రిజర్వేషన్‌పై చర్చ జరగాలని, అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని వివిధ పార్టీలకు లేఖలు రాశారు. ఇదిలాఉంటే, ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్.. ఈ నెల 15 జరిగే సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు.