Asianet News TeluguAsianet News Telugu

KCR oath as MLA: కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం..! ముహూర్తం ఎప్పుడంటే..? 

KCR oath as MLA: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. 

BRS Cheif KCR Oath Taking Ceremony KRJ
Author
First Published Jan 28, 2024, 4:26 AM IST | Last Updated Jan 28, 2024, 4:26 AM IST

KCR oath as MLA: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆయన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా (Gajwel MLA) ప్రమాణస్వీకారం చేయనున్నారు.  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో ఆయన తుంటి ఎముకకు వైద్యులు సర్జరీ చేయగా.. గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. చేతి కర్ర సాయంతో అడుగులు చేస్తున్నారు.

ఇప్పుడు కాస్త కోలుకోవడంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఇంకా ప‌టిష్టంగా ఉంద‌ని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. ఈ తరుణంలోపార్టీని ముందుండి నడిపించాలంటే.. కేసీఆర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ముందుగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బీఆర్‌ఎస్ అధినేత పార్టీకి వాయిస్‌ని ఎలా ఇస్తారో చూడాలని అందరి దృష్టి ఆయనపైనే ఉంది. కేసీఆర్ ప్రమాణ స్వీకారంతో అసెంబ్లీ హౌస్‌లో బీఆర్ఎస్ తరుపున ప్రతిపక్ష నాయకుడు ఎవరనే స్పష్టత కూడా వస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios