Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అడ్డగింత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత..

నాగర్‌కర్నూలు జిల్లా మాయమ్మపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Brs and congress workers clash in nagarkurnool district after stops nagam janardhan reddy
Author
First Published Jan 7, 2023, 1:07 PM IST

నాగర్‌కర్నూలు జిల్లా మాయమ్మపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బిజినేపల్లి సమీపంలోని మార్కండేయ రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అయితే నాగం జనార్ధన్ రెడ్డిని, ఆయన అనుచరులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇక్కడ పని ఏమిటని నాగం జనార్దన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేత తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టడంతో అక్కడ పరిస్థితి చక్కబడింది.  

Follow Us:
Download App:
  • android
  • ios