వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ (brohter anil kumar) శుక్రవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. మా సీక్రెట్‌లు మాకు ఉంటాయన్నారు. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అని వ్యాఖ్యానించారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందని, తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని.. దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు. 

రాజకీయాలు అంటే మంచి చేయటమని... రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్‌ను (undavalli arun kumar) కలిసినట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ (brohter anil kumar) తెలిపారు. శుక్రవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో అనిల్ భేటీ అయ్యారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ.... మా సీక్రెట్‌లు మాకు ఉంటాయన్నారు. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అని వ్యాఖ్యానించారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందని, తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని.. దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు. 

అనంతనం ఈ భేటీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... బ్రదర్ అనిల్‌తో ఉన్న కుటుంబ సంబంధం నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కలిసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ, కుటుంబ పరిస్థితులపై చర్చించామని అరుణ్ కుమార్ తెలిపారు. భీమవరం వెళుతూ తనను కలిశారని... ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం పుస్తకాన్ని అనిల్‌కు అందజేసినట్లు ఉండవల్లి చెప్పారు. 

కాగా.. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajasekhara reddy ) గారాలపట్టి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే వార్త చాలా రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికలకన్నా ముందే ఆమె పార్టీ పెడతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినా.. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. అందుకే ఆమె తన రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ కంటే ఏపీనే బెటర్ అని భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనను ఏపీ ప్రజలు ఆధారస్తారని షర్మిల భావిస్తారు. ఇటీవల ఆమె పరోక్షంగా పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు కూడా.. రాజకీయ పార్టీ అన్నది ఎవరు ఎక్కడైనా పెట్టొచ్చని... తాను ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడితే తప్పు ఏంటి అని షర్మిల మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ .. ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 

కాగా.. వైఎస్ షర్మిల (YS Sharmila) నాయకత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో నమోదు చేయడానికి దరఖాస్తుదారు వార్తాపత్రికలలో ప్రచురించిన పబ్లిక్ నోటీసుకు ప్రతిస్పందనగా అభ్యంతరాలు వచ్చాయని.. అయితే అవి సమర్ధించదగినవి కావని కమిషన్ గుర్తించినట్టుగా తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A ప్రకారం Y.S.R. Telangana Party రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని తెలిపింది. ఇది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. 

కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రజా ప్రస్తానం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని షర్మిల ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఆమె పాదయాత్రను తిరిగి మొదలుపెట్టనున్నారు. నల్గొండ జిల్లా కొండపాకగూడెం నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.