కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. ఓ జంట జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వెళ్తుండగా  కొందరు వ్యక్తులు నవ వధువును కిడ్నాప్ చేశారు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. ఓ జంట జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకుని తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు నవ వధువును కిడ్నాప్ చేశారు. అదే సమయంలో వరుడిపై కూడా దాడి చేశారు. వివరాలు.. కిడ్నాప్‌గురైన నవ వధువు హనుమకొండ జిల్లా మడికొండ గ్రామం కాగా.. వరుడు స్వస్థలం వరంగల్. అయితే వీరు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. కారులో వచ్చిన కొంత మంది హుజురాబాద్ అంబేడ్కర్ విగ్రహం వారిని అడ్డుకుని.. నవ వధువను కిడ్నాప్ చేశారు. అయితే వధువు తరఫు బంధువులే ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.