హైదరాబాద్: లాక్ డౌన్ ఉల్లంఘించి వివాహ నిశ్చితార్థం నిర్వహించిన ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. ఈ ఫంక్షన్ కారణంగా 15 మంది వైరస్ బారినపడ్డారు. మరొకరు కరోనాతో మృతి చెందారు.

ఈ నెల 11వ తేదీన దూల్ పేటలో వివాహ నిశ్చితార్థాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 300 మంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి 15 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. వరుడి పెళ్లి కొడుకు తండ్రి కూడ కరోనా సోకి మృతి చెందాడు. 

also read:తెలంగాణలో కొత్తగా 42 కేసులు.. 34 హైదరాబాద్‌లోనే: 1,634కి చేరిన సంఖ్య

ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైన వారెవరు హాజరయ్యారనే విషయమై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలకు పోలీసులు సిద్దమయ్యారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకొంటుంది. కానీ కొందరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంలో కరోనా వ్యాప్తి చెందుతోందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.తెలంగాణలో కరోనా కేసులు 1634కు చేరుకొన్నాయి. తెలంగాణలో ఎక్కువ కేసులు జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా ఉన్నాయి.