సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన రెండో రోజే నవవరుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.  సోమవారం రిసెప్షన్‌కు కూడా ఏర్పాట్లు చేశారు. అంతా ఈ కార్యక్రమానికి రెడీ అవుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది. 

సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన రెండో రోజే నవవరుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. జీవితంలో స్థిరపడటంతో ఓ మంచి అమ్మాయితో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. శనివారం అంగరంగ వైభవంగా నిరంజన్ పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులతో ఇళ్లు కళకళలాడుతోంది. సోమవారం రిసెప్షన్‌కు కూడా ఏర్పాట్లు చేశారు. అంతా ఈ కార్యక్రమానికి రెడీ అవుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది. 

వరుడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నిరంజన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్ల జరిగిన రెండో రోజే ఇలా జరగడంతో గ్రామంలోనూ విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అటు నవ వధువు కుటుంబం కూడా షాక్‌కు గురైంది. కాళ్ల పారాణి ఆరక ముందే ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఆమెను ఓదార్చడం ఎవ్వరితరం కావడం లేదు.