‘పుష్ఫ’ను మించి గంజాయి స్మగ్లింగ్.. ఇటుక ట్రాక్టర్ బోల్తా పడటంతో వెలుగులోకి..

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ హైవేపై ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. అందులో మొత్తం ఇటుకలు ఉన్నాయి. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో అందులో గంజాయి బయటపడింది.

Brick tractor overturned.. Ganja seizure..ISR

పుష్ప సినిమాలో హీరో పోలీసుల కళ్లు గప్పి ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేసిన సీన్ అందరికీ గుర్తే ఉంటుంది. అందులో పాలు సరఫరా చేసే ట్యాంకర్ లో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి దంగలను, పోలీసులకు చిక్కకుండా వారి ముందు నుంచి తీసుకెళ్తుంటాడు. అయితే దానిని మించిన సీన్ ఒకటి మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో జరిగింది. ఇటుక ట్రాక్టర్ లో గంజాయిని తరలిస్తుండగా.. అది బోల్తా పడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి - రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్..

వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సమీపంలో ఉన్న నేషనల్ హైవేపై ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒకటి ఆదివారం బోల్తా పడింది. ముందుగా అందులో కేవలం ఇటుకలు మాత్రమే ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు ఆ ట్రాక్టర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దానిని మొత్తం వెలికి తీయగా.. సుమారు 5 క్వింటాళ్ల ఎండు గంజాయి లభ్యం అయ్యింది.

భారత్ తో సంబంధాలు మాకు చాలా కీలకం - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్

ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ గంజాయిని ఛత్తీస్ ఘడ్ నుంచి ఇక్కడి తరలిస్తున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారని ‘ఏబీపీ దేశం’ నివేదించింది. గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు దుండగులు ట్రాక్టర్ కు ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios