నారాయణపేట: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ కొండ్రోనుపల్లి గ్రామంలో శిరీష అనే విద్యార్థిని శనివారంనాడు ఆత్యహత్య చేసుకుంది. 

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో ఆమె మరణించింది. ఇంటర్మీడియట్ బైపిసి చదువుతున్న శిరీష ఫస్టియర్ పేపర్లలో ఓ సబ్జెక్టులో ఫెయిలైంది. 

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థినీవిద్యార్థుల ఆత్మహత్యలు 20 దాటినట్లు అనధికారిక అంచనా. ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్ర రూపం దాల్చింది.