బుధవారం స్క్రాప్ గోడౌన్ లో అగ్నిప్రమాదంలో మరణించిన 11మంది వలసకార్మికుల మృతదేహాలను గురువారం ప్రత్యేక విమానంలో బీహార్ కు తరలించారు.
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బోయిగూడ fire accident ఘటనలో సజీవ దహనమైన 11 మంది bihar వలస కార్మికులు dead bodyలను నిన్ననే గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడి మార్చురీలో భద్రపరిచారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాలను తరలించారు. అక్కడినుంచి రెండు special flightsల్లో పట్నా తీసుకెళ్లారు. పట్నా చేరుకున్న అనంతరం కతిహార్, చాప్రా జిల్లాల్లోని వారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించనున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని hyderabadలోని బోయిగుడాలో భారీ fire accident చోటు చేసుకుంది. బోయిగుడాలోని Timber Depotలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. టింబర్ డిపోలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. 11మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి.
ఎనిమిది ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లు తెలుస్తోంది. ఊపిరి తీసుకోవడానికి అతను ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. జనావాసాల మధ్య ఈ టింబర్ డిపో ఉంది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్లాస్టిక్ గోడౌన్ లో పనిచేస్తున్నారు.
ఈ ఘటనలో సజీవ దహనమైన 11 మంది కార్మికుల మృతదేహలకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతులను కూడా గుర్తించారు.
బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జనావాసాల మధ్య ఉన్న ఈ గోడౌన్ కు ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయం మీద స్తానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక ప్రమాదంలో మరణించినవారి మృతదేహలను గురువారం విమానంలో శంషాబాద్ విమానాశ్రయం నుండి బీహార్ కు తరలిస్తామని ప్రకటించారు.. బీహార్ రాష్ట్రంలోని చప్రా జిల్లా నుండి కార్మికులు ఉపాధి కోసం హైద్రావాద్ వచ్చి ఈ గోడౌన్ లో పనిచేస్తున్నారు.
వీరితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బీహార్ కు చెందిన వారు ఉపాధి కోసం వచ్చి నివసిస్తున్నారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకొన్న తర్వాత వారంతా సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. గాంధీ ఆసుపత్రి వద్ద మృతుల బంధువులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. మరో వైపు ఈ గోడౌన్ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి సంబంధిత శాఖలతో సమీక్ష చేయనున్నారు. ఫైర్, పోలీస్, విజిలెన్స్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. గోడౌన్లలో సేఫ్టీ చర్యలు ఎలా ఉన్నాయనే విషయాలపై కూడా చర్చించనున్నారు.
