హైదరాబాద్‌లో విషాదం ... స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి, పోలీసుల అదుపులో యజమాని
హైదరాబాద్ నాగోల్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి చెందిన కేసులో ఎంబీఆర్ స్విమ్మింగ్ పూల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూల్‌లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ (hyderabad) నగరంలోని నాగోల్‌లో (nagole) విషాదం చోటు చేసుకుంది. స్థానిక బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో (blu fab swimming pool ) మునిగి బాలుడు మృతి చెందాడు. చిన్నారులకు స్విమ్మింగ్ ట్యూబ్స్ ఇవ్వలేదు పూల్ సిబ్బంది. స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపించారు. ఈ బాలుడికి 10 సంవత్సరాలు. కాగా బాలుడు స్విమ్మింగ్ చేస్తుండగా ట్రైనర్ కూడా దగ్గరలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాలుడు మనోజ్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన 10 నిమిషాల వరకు సిబ్బంది పత్తా లేకుండా పోయారని బంధువులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి స్విమ్మింగ్ పూల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.