హైదరాబాద్: డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికుల నుండి నిరసనను ఎదుర్కొన్నారు. బౌద్దనగర్ డివిజన్ లో  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్ లో  కంది శైలజకు మద్దతుగా  డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తమ సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు స్థానికులు.

ఓ మహిళ ఏకంగా తన నోటికొచ్చినట్టుగా దూషించింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాను గతంలో ఆందోళన చేస్తే కనీసం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.ఇప్పుడు ఓట్లు అడుగేందుకు ఎలా వస్తారని ఆమె ప్రశ్నించారు. మా సమస్యలు పరిష్కరించకుండా  ఓట్ల కోసం రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహంం వ్యక్తం చేసింది.

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లిన నాయకులకు ప్రజల నుండి చాలా ప్రాంతాల్లో ప్రజల నుండి నిరసన వ్యక్తమౌతోంది. అన్ని పార్టీల నేతలు ఈ నిరసనను ఎదుర్కొంటున్నారు. అధికంగా అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో తమ డిమాండ్లను స్థానికులు నేతల ముందుంచుతున్నారు.