శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉన్నట్టుగా బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు.
శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉన్నట్టుగా బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని పోలీసులు సూచించారు. దాదాపు గంటన్నర పాటు రైలులో తనిఖీలు చేపట్టిన అధికారులు.. రైలులో బాంబు లేదని తేల్చారు. రైలులో బాంబు లేదని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో కొంతసేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తనిఖీలు నిర్వహించి బాంబు లేదని అధికారులు తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరనే వివరాలు తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
