11 నెలలు బొల్లారం రాష్ట్రపతి నివాసంలోకి ప్రజలకు అనుమతి: ముర్ము

హైద్రాబాద్ బొల్లారం  రాష్ట్రపతి  నిలయాన్ని  11 నెలల పాటు  ప్రజల సందర్శనకు  అనుమతి ఇవ్వనున్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి  ప్రారంభించారు.

Bollaram Rashtrapati Nilayam is open for visitors From Today lns

హైదరాబాద్: నగరంలోని  బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి  ఇవాళ్టి  ప్రజలకు అనుమతి ఇచ్చారు11 నెలల పాటు  ప్రజలకు  బొల్లారం రాష్ట్రపతి  నిలయంలోకి  అనుమతి  ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము   బుధవారంనాడు  వర్చువల్ గా  ప్రారంభించారు.  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని   రాష్ట్రపతి  ముర్ము  కోరారు. రాష్ట్రపతి  నిలయానికి  సంబంధించిన  సమాచారం నాలెడ్జ్ గ్యాలరీలో  ఉంటుందని  ముర్ము  చెప్పారు.  రాష్ట్రపతి  నిలయం తెలంగాణ  సంస్కృతి, సంప్రదాయాలతో  నిర్మించిన విషయాన్న ఆమె గుర్తు  చేశారు. 

ఉగాదిని  పురస్కరించుకొని  బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో  ఉగాది వేడుకలను  నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని   వర్చువల్ గా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.   ఈ సందర్భంగా  గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  ప్రసంగించారు.  ప్రజందరికి   ఉగాది శుభాకాంక్షలు తెలిపారు  తమిళిసై.. అందరూ ఆరోగ్యంగా .సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని  తమిళిసై చెప్పారు.  రాష్ట్రపతి  భవన్ ను  ప్రజల సందర్శన కోసం  11నెలల పాటు ప్రజలకు అనుమతించిన  రాష్ట్ర పతికి గవర్నర్ కృతజ్ఞతలు చెప్పారు.  గతంలో  11 రోజులు మాత్రమే  ప్రజలను అనుమతి ఉండేదన్నారు.   రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని ప్రత్యేకమైన టూరిస్ట్ ప్రాంతంగా  నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.  రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్ లైన్ లో  టికెట్లు బుక్ చేసుకోవచ్చని  గవర్నర్  తెలిపారు. 

తెలుగు ప్రజలకు కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి   శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రపతి నిలయాన్ని 11నెలల పాటు ప్రజలకు సందర్శనార్థం ప్రారంభించే నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి. ఉగాది పర్వదినాన  ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించుకోవడం గొప్ప విషయంగా  ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ బిల్డింగ్ అని  ఆయన గుర్తు  చేశారు.  
హైదరాబాద్ లో అనేక పర్యాటక కేంద్రాలు వున్నాయన్నారు. అందులో ఒకటిగా చేరింది రాష్ట్రపతి నిలయం చేరిందని  కిషన్ రెడ్డి  చెప్పారు.  

రాష్ట్రపతి కార్యకలాపాల పట్ల అవగాహన కలిగించే విధంగా ఈ రకమైనసందర్శనాలు చాలా ఉపయోగపడుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  హైదరాబాద్ ను విజిట్ చేసే వారు కచ్చితంగా రాష్ట్ర పతి నిలయం  సందర్శించాలని  ఆయన  కోరారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీ,  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  తదితరులు  ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. . 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios