సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విషాదం నెలకొంది. ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. 

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోని sangareddy జిల్లాలో మంగళవారం ఘోర road accident జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. Zaheerabad శివారులో బొలేరో వాహనం ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో బొలేరో వాహనంలో మంటలు లేచాయి. ఇందులో ఒకరు దగ్ధమయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ముంబై నుంచి హైరదాబాదు వస్తున్న ప్రైవేట్ బస్సును హైదరాబాదు నుంచి లాతూరు వెళ్తున్న బొలేరో వాహనం ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది.

ఇదిలా ఉండగా, ఈ ఆదివారం కామారెడ్డిలో ఇలాగే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  Kamareddy జిల్లాలో జరిగిన Road Accidentపై ప్రధానమంత్రి Narendra Modi దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయంగా రెండు లక్షల  Ex Gratia ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారికి చికిత్సకోసం రూ. 50000 ప్రకటించారు. కాగా జిల్లాలోని ఎల్లారెడ్డి బాన్సువాడ రహదారిపై అన్నాసాగర్ తండా సమీపంలో జరిగిన లారీ ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది గాయపడ్డారు. 

ఈ సంఘటనపై రాష్ట్ర. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,  ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాన్సువాడ ఎల్లారెడ్డి నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

కాగా, కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 20 కోట్ల మందికి తీవ్ర గాయాలయ్యాయి ఎల్లారెడ్డి మండలం హాసన్ పల్లి గేట్ సమీపంలో ఈ దారుణం జరిగింది. పిట్ల మండలం చిల్లర్గి ఈ గ్రామానికి చెందిన కొందరు ఎల్లారెడ్డి సంతకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిని డ్రైవర్ స్థాయిలు, లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్యలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏప్రిల్ 28న సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ రాణే బ్రేక్‌ లైనింగ్‌ కంపెనీకి దగ్గరలో కారు అదుపుతప్పి.. అవతలి వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. వివరాల్లోకి వెడితే .. గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి.