Asianet News TeluguAsianet News Telugu

ఓ వ్యక్తిని చావబాదుతున్న అధికార పార్టీ కార్పోరేటర్... అరెస్ట్ (వీడియో)

 హైదరాబాద్ లోని బోడుప్పల్ ప్రాంతంలో భూవివాదంలో తలదూర్చడమే కాకుండా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన అధికారపార్టీ కార్పోరేటర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. 

boduppal trs carporator arrest
Author
Hyderabad, First Published Jul 17, 2020, 10:21 AM IST

హైదరాబాద్: హైదరాబాద్ లోని బోడుప్పల్ ప్రాంతంలో భూవివాదంలో తలదూర్చడమే కాకుండా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన అధికారపార్టీ కార్పోరేటర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బిబినగర్ టోల్ గేట్ వద్ద కార్పోరేటర్ ను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు శివ గౌడ్ అనే అనుచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వీడియో

"

ఈ వివాదానికి సంబంధించిన వివరాలను బాధితుడి భార్య వెల్లడించారు. మేడ్చెల్ జిల్లా బోర్డుప్పల్ ద్వారకా నగర్ లో ఆరు సంవత్సరాల క్రితం బ్యాంక్ ద్వారా కొన్న ఇల్లులో తమకు వాటా ఉన్నదని స్థానిక టీఆరెస్ కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడని అన్నారు. అతడి దౌర్జన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన భర్త  భర్త పురెందర్ రెడ్డిపై కార్పోరేటర్ తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారని బాధిత మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.

కార్పొరేటర్, ఆయన అనుచరులు కలిసి  విచక్షణారహితంగా దాడి చేయడంతో తన భర్తకు తీవ్ర గాయాలయ్యాయని...ప్రస్తుతం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని బాధిత మహిళ ఆనంతుల బానోదయ కమిషన్ కు వివరించింది.ఈ సంఘటనపై మేడిపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కార్పొరేటర్ తో కుమ్మకై తిరిగి తమపైనే అక్రమంగా కేసు పెట్టి వేదిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి కార్పొరేటర్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడం కాదు కనీసం కేసు కూడా నమోదు చేయకలురని హెచ్చార్సీకి తెలిపారు. కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించడంతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలుహెచ్చార్సీని వేడుకుంది.

అయితే తప్పించుకొని తిరుగుతున్న శ్రీధర్ గౌడ్ ని ఇవాళ బిబినగర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటి సిఐ నవీన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్పరేటన్ ను అదుపులోకి తీసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios