జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ నోరు విప్పారు. ప్రమాదానికి గురైన కారు తన కజిన్ ది అని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు.  బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా తాను తన కజిన్ కు సూచించానని చెప్పారు.

హైదరాబాద్: Jubilee hills ప్రమాదానికి కారణమైన కారు తనది కాదని బోధన్ ఎమ్మెల్యే Shakeel తేల్చి చెప్పారు. ఈ కారు తన కజిన్ Mirzaది అని షకీల్ తెలిపారు. శుక్రవారం నాడు ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. 

జూబ్లీహిల్స్ లో ప్రమాదానికి కారణమైన కారుకు బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. అప్పుడప్పుడూ ఈ కారును తాను ఉపయోగిస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. ఈ కారణంతోనే తాను ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించినట్టుగా చెప్పారు. ఈ ప్రమాదం గురించి తాను తన కజిన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొన్నానని ఆయన వివరించారు. 
ప్రమాదం జరిగిన సమయంలో భయంతోనే తన చేతిలోని బిడ్డను మహిళ వదిలేసిందని షకీల్ చెప్పారు. ఆ మహిళ బిడ్డను వదిలేయడంతోనే ఆ చిన్నారి చనిపోయినట్టుగా షకీల్ వివరించారు.

"

ప్రమాదం జరిగిన సమయంలో కారును తన కజిన్ మీర్జా కొడుకు నడిపినట్టుగా ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా తాను తన కిజిన్ మీర్జాను కోరలేదన్నారు. ఈ ప్రమాదం జరగడంతో డ్రైవర్ ను స్థానికులు కొట్టారని ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. దీంతో భయంతో వారంతా పారిపోయారని షకీల్ వివరించారు.

గురువారం నాడు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు 45 నెంబర్ వద్ద ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు మాసాల చిన్నారి మరణించగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కారుకు బ్లాక్ గ్లాస్ లున్నాయి. అయితే కారులో ఎవరున్నారనే విషయాన్ని పరిశీలించేందుకు పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. అయితే కారుకు బ్లాక్ గ్లాసు ఉండడం వల్ల కారులో ఎందరున్నారనే విషయాన్ని గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. రెండు నెలల చిన్నారి మృతదేహనికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ ప్రమాదానికి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కారణంగా స్థానికలు ఆరోపిస్తున్నారు. రోడ్లపై బెలూన్లు విక్రయించుకొనే కుటుంబానికి చెందిన రెండు నెలల చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది. సిగ్నల్ పడగానే వాహనాల వద్దకు వెళ్లి బెలూన్లు విక్రయించేందుకు రోడ్డు పక్కన ఉన్న పుట్ పాత్ పై బాధితులు కూర్చొన్నారు. అయితే ఈ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో చిన్నారి మరణించగా మిగిలిన వారు గాయపడ్డారు.