Asianet News TeluguAsianet News Telugu

2014 లో ఆ మాట నిలబెట్టుకోలేదు, 2018 లో అయినా నిలబెట్టుకుంటావా..? : కేసీఆర్ కి అమిత్ షా సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమే ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆరోపించారు. ఆయన మాటమీద నిలబడే మనిషి కాదని విమర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఓ దళితుడికి అవకాశం ఇస్తానని ప్రచారం చేసుకున్న కేసీఆర్...2014 లొ గెలవగానే ఆ మాట తప్పారని విమర్శించారు. అయితే ఆ మాటను 2018 లో అయినా నిలబెట్టుకుంటారా? అంటూ కేసీఆర్ కు అమిత్ షా సవాల్ విసిరారు. 
 
blp national president amith shah fires on kcr
Author
Hyderabad, First Published Sep 15, 2018, 1:28 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమే ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆరోపించారు. ఆయన మాటమీద నిలబడే మనిషి కాదని విమర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఓ దళితుడికి అవకాశం ఇస్తానని ప్రచారం చేసుకున్న కేసీఆర్...2014 లొ గెలవగానే ఆ మాట తప్పారని విమర్శించారు. అయితే ఆ మాటను 2018 లో అయినా నిలబెట్టుకుంటారా? అంటూ కేసీఆర్ కు అమిత్ షా సవాల్ విసిరారు. 

బిజెపి శనివారం పాలమూరులో ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తోంది. ఇందులో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొననున్నారు. ఇందుకోసం ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్న ఆయన బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు.

మూడనమ్మకాల కారణంగా సీఎం సచివాలయంలో అడుగుపెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.  జమిలి ఎన్నికలకు మొదట సమర్ధించినట్లు నటించిన కేసీఆర్ ఇప్పుడు అకస్మాత్తుగా ముందస్తు ఎన్నిరలకు వెళ్లారన్నారు. ఇలా స్వార్థ నిర్ణయాలతో ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపుతున్నారని ఆరోపించారు. కానీ భారతీయ జనతా పార్టీ ''ఒకే దేశం ఒకే ఎన్నికలు'' అన్న నినాదంతో ముందుకు వెళుతోందని, తమ నాయకుడు మోదీ ఆలోచన కూడా ఇదేనని అమిత్ షా స్పష్టం చేశారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios