అంబేద్కర్ ముఖానికి నల్ల ముసుగు

First Published 10, Jun 2018, 1:28 PM IST
block mask for ambedkar statue
Highlights

యాదాద్రి జిల్లాలో దారుణం

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ర కు యాదాద్రి జిల్లాలో అవమానం జరిగింది. ఆయన విగ్రహానికి భువనగిరిలో గుర్తు తెలియని దుండగులు ముఖానికి నల్ల ముసుగు వేశారు. ఈ ఘటన భువనగిరిలో ఉద్రికత్తకు కారణమైంది.

ఈ విషయమై ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్, టిడిపి ఎస్సీ సెల్ డిమాండ్ చేశాయి. ఈ కుట్రకు ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థే కారణమని ఆరోపించాయి.

తక్షణమే వారిపై చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోసుకొండ వెంకటేష్, టిడిపి సీనియర్ నేత బోంట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మతోన్మాదుల దుర్ఛర్యను అందరూ ఖండించాలని వారు పిలుపునిచ్చారు.

loader