తెలంగాణ సిఎం కేసిఆర్ మాట్లాడిన భాషపై బిజెపి భగ్గున మండింది. ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సహదేవ్ యాదవ్ కేసిఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. భారత ప్రధానిని పట్టుకుని వాడు, వీడు అని మాట్లాడిన కేసిఆర్ కు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురా నియోజకవర్గం కూర్మగూడ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ సహదేవ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీడియో కింద ఉంది చూడండి.