Asianet News TeluguAsianet News Telugu

Telangana Elections: 50+ మందితో తొలి జాబితా సిద్ధం.. ఎన్నిక‌ల బ‌రిలో 35-40 మంది బీసీలు : బీజేపీ

Telangana BJP: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేలంలో పాల్గొంటున్నట్లుగా ఉచితాలు ప్రకటిస్తున్నాయనీ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింద‌ని బీజేపీ విమ‌ర్శించింది. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో విఫలమైందనీ, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్నులతో ప్రజలపై భారం మోపుతున్నాయని కాషాయ పార్టీ నాయ‌కుడు కే. లక్ష్మణ్ ప్రజలను హెచ్చరించారు.
 

BJP to field 35-40 BC candidates for Telangana Assembly Elections 2023: MP K Laxman RMA
Author
First Published Oct 21, 2023, 3:33 PM IST | Last Updated Oct 21, 2023, 3:33 PM IST

Telangana Assembly Elections 2023: రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ 35 నుంచి 40 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతుందనీ, 50 మందికి పైగా అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితా సిద్ధంగా ఉందని బీజేపీ ఎంపీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు కే.లక్ష్మణ్ తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టికెట్ల కేటాయింపులో బీసీ నేతలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందనీ, కాంగ్రెస్ కు బీసీ ఓట్లు మాత్రమే కావాలనీ, సీట్లు కావని విమర్శించారు. ఒక పార్టీ (బీఆర్ఎస్) కేవలం 23 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇస్తే, మరో పార్టీ (కాంగ్రెస్) ఆ పని కూడా చేయలేదన్నారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేలంలో పాల్గొంటున్నట్లుగా ఉచితాలు ప్రకటిస్తున్నాయనీ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింద‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో విఫలమైందనీ, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్నులతో ప్రజలపై భారం మోపుతున్నాయని లక్ష్మణ్ ప్రజలను హెచ్చరించారు. ఒక బీసీని ప్రధానిని చేయడం, వారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, 27 మంది కేంద్ర మంత్రులను నియమించడం ద్వారా బీజేపీ బీసీ అనుకూల పార్టీగా తనను తాను పదేపదే నిరూపించుకుందనీ, తెలంగాణలోని ఐదుగురు బీజేపీ ఎంపీల్లో ముగ్గురు బీసీలేనని గుర్తు చేశారు. విద్యా సంస్థలు, ఎంబీబీఎస్, ఎండీ ప్రోగ్రామ్లు, సైనిక్ స్కూళ్లు, ఇతర సంస్థల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది ప్రధాని నరేంద్ర మోడీయేనని పేర్కొన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకే ఈక పక్షులు.. 

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకే ఈక పక్షులుగా అభివర్ణించిన లక్ష్మణ్, ప్రతిపక్ష కూటమిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఢిల్లీలో చర్చలు జరిగాయనీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పార్టీలన్నీ ఒక్కటవుతాయని అన్నారు. అధికార వ్యతిరేక ఓటును చీల్చాలని బీఆర్ఎస్ భావిస్తోంద‌నీ, అందుకే కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ను జాక్ తో పైకి లేపుతున్నార‌ని ఆరోపించారు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు సహకరించేందుకు కేసీఆర్ భారీగా ఖర్చు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన లేని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పారు. అలాగే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలా వద్దా అనే అంశంపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంద‌ని చెప్పారు. గోషామహల్ నుంచి మళ్లీ పోటీ చేసేందుకు అనుమతించాలని రాజాసింగ్ మద్దతుదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారని కేంద్ర నాయకత్వానికి సమాచారం అందింది. పార్టీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios