బీజేపీకి అనుకూలంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: బండి సంజయ్ సంచలనం
బీజేపీకి అనుకూలంగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏనాడూ కూడా వ్యాఖ్యలు చేయలేదన్నారు.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ komatireddy Venkat Reddy పలు దఫాలు తమ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం నాడు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగరి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ నాలుగో రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ Chit Chat చేశారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
BJP కి, ప్రధాని Narendra Modi కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుకూలంగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.ఏనాడూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదన్నారు. బీజేపీకి అనుకూలంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారని బండి సంజయ్ చెప్పారు.
Munugode అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్ం చేశారు. తెలంగాణలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.TRS ఎమ్మెల్యేలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. చీకోటి ప్రవీణ్ వ్యవహరాన్ని డ్రగ్స్ కేసు మాదిరిగానే నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
ఈ నెల రెండో తేదీన రాత్రి మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.పార్టీ మార్పు విషయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత వ్యవహరంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై తాను స్పందించనని చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. కొంతకాలంగా ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని రాజగోపాల్ రెడ్డి పదే పదే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని కూడా ఆయన ప్రకటించారు. త్వరలోనే స్పీకర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
also read:రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాక్: క్షమాపణలు చెప్పాల్సిందే
ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు టే బ్రాండీ షాప్ పెట్టుకొనే వాళ్లంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నిరు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేయకుండా తనను కూడా కలిపి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా ప్రకటించారు. 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం తాను రక్తాన్ని ధారపోసినట్టుగా చెప్పారు. తాను యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐలలో పనిచేసే సమయంలో రేవంత్ రెడ్డి స్కూల్లో చదువుతున్నాడన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేస్తున్న తనను అవమానపర్చడం సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడా అని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.