న్యూఢిల్లీ: కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు న్యూఢిల్లీలో  ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీ నుండి రాగానే సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.

ఢీల్లీ పర్యటనలో కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలని ఆయన కోరారు. కేసీఆర్ పర్యటనపై ప్రజల్లో సందేహాలున్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిందిగా కోరారు.కేసీఆర్ ఢిల్లీలో పొర్లు దండాలు పెట్టినా అవినీతిపై విచారణ ఆగదన్నారు.

 ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ ఢిల్లీ టూర్ చేశారని ఆయన విమర్శించారు.వరదల్లో బయటకు రాని కేసీఆర్ ఢిల్లీ వచ్చి వరద సాయం అడగడంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కేసీఆర్ కట్టుకథలు , కేంద్రమంత్రులు నమ్మలేదని ఆయన తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలను గుప్పిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పై బీజేపీ విమర్శల దాడిని పెంచింది.