హరీష్ రావు అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడట అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


హైదరాబాద్: హరీష్ రావు అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడట అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.శుక్రవారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

 తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొన్న హరీష్ కు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె హరీష్ రావుకు దొరకదా అని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆయన విమర్శింవారు.ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని తాను లేఖ రాసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన విషయాన్ని తాను వదలనని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కోవిడ్ నుండి కోలుకొన్న తర్వాత కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.