తెలంగాణలో రజాకార్ల పాలన: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరింగ్ పై బండి సంజయ్


కేంద్రం ఈడీని ఉపయోగించుకొంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా మిగలరని చెప్పారు.మునుగటోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడో పారిపోయిందన్నారు. 

BJP Telangana President Bandi Sanjay  Reacts On Minister Srinivas Goud Firing Incident

నల్గొండ:  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీలో కాల్పులు జరుపుతంటే తెలంగాణలో రజాకార్ల పాలన మళ్లీ వచ్చినట్టుగా కన్పిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు  మీడియాతో చిట్ చాట్ చేశారు.స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభ సూచికంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్  గాల్లోకి కాల్పులు జరిపారు.ఈ రకంగా కాల్పులు జరపడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లైసెన్స్ ఉన్న గుండాలు అంటూ ఆయన మండి పడ్డారు. 

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను విమర్శించలేదన్నారు. తనతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టచ్ లో ఉన్నారని తాను ఏనాడూ కూడా చెప్పలేదని మరోసారి వివరణ ఇచ్చారు బండి సంజయ్.కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంచి లీడర్ అని ఆయన కితాబిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక నుండి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో పారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈడీని కేంద్ర ప్రభుత్వం వాడుకోదల్చుకొంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు. 

కమ్యూనిష్టులు ఎప్పుడు ఎలా ఉంటారో  వారికే తెలియదన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన చెప్పారు.ప్రజా సంగ్రామ యాత్రను విడతల వారీగా  పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్రను పూర్తి చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని  బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.  ఈ తరుణంలో ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తుంది.  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ప్లాన్ చేస్తుంది.ఈ నెల 22న బీజేపీ నేతలు ఈ నియోజకవర్గంలో మకాం వేయనున్నారు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రకూడా తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20న టీఆర్ఎస్ సభను ఏర్పాటు చేసింది.ఈ నెల 21న బీజేపీ చౌటుప్పల్ లో సభను ఏర్పాటు చేసింది.ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios