హైకోర్టు అనుమతి: ప్రారంభమైన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం నాడు  పున: ప్రారంభమైంది. తెలంగాణ హైకోర్టు గురువారం నాడు సాయంత్రం ఈ యాత్రకు అనుమతి ఇవ్వడంతో ఇవాళ ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ప్రజాసంగ్రామ యాత్రను బండి సంజయ్ యాత్రను ప్రారంభించారు. 

BJP Telangana president Bandi Sanjay Praja Sangrama yatra Begins in Warangal District

వరంగల్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం నాడు ఉదయం పున: ప్రారంభమైంది. ఉప్పుగల్, కూనూరు, గర్మెపల్లి , నాగాపురం వరకు ఇవాళ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగనుంది.తెలంగాణ హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు నిన్న అనుమతి ఇవ్వడంతో ఇవాళ ఉదయమే బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకారంగా గురువారం నాడు రాత్రి ఎక్కడ పాదయాత్ర ముగుస్తుందో అక్కడి నుండే బండి సంజయ్ ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై హైద్రాబాద్ లో బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనల్లో పాల్గొన్న బీజేపీ శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.ఈ కేసులను నిరసిస్తూ ఈ నెల 23న పాదయాత్ర శిబిరం వద్దే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ నుండి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు.  వరంగల్ జిల్లాలో చోటు చేసుకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను రద్దు చేసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు ఈ నెల 23న లేఖను ఇచ్చారు.ఈ లేఖపై బీజేపీ నేతలు అదే రోజున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్ధన్నపేట ఏసీసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్  అయింది. దీంతో గురువారం నాడు రాత్రే పాదయాత్ర ప్రారంభించే చోటుకు బండి సంజయ్ చేరుకున్నారు. ఇవాళ ఉదయమే తన పాదయాత్రను ప్రారంభించారు. రేపు ఉదయం భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. 

ఈ నెల 2వ తేదీన యాద్రాద్రిలో బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావంత్  ప్రారంభించారు. యాదాద్రిలో ప్రారంభమైన యాత్ర వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఈ నెల 27న ముగియనుంది. విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల పాదయాత్రలు ముగిశాయి. రేపటితో మూడో విడత పాదయాత్ర ముగియనుంది. 

also ead:బండి సంజయ్‌కి ఊరట.. ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం టీఆర్ఎస్ సర్కార్ కుఇబ్బందిగా మారిందని బీజేపీ విమర్శలు చేస్తుంది. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈ యాత్రను అడ్డుకొనే ప్రయత్నం చేశారన్నారు. హైకోర్టు అనుమతితో తమ యాత్రకు లైన్ క్లియర్ అయిందని బండి సంజయ్ తెలిపారు.వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యే సమయానికి  రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పూర్తి చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. మూడో విడత పూర్తైన తర్వాత త్వరలోనే నాలుగో విడత పాదయాత్రపై పార్టీ నాయకత్వం ప్లాన్  చేయనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios