Asianet News TeluguAsianet News Telugu

భయమనేది లేకండా బతికాడు:హీరో కృష్ణకు బండి సంజయ్ నివాళి

హీరో కృష్ణ బౌతికకాయానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ నివాళులర్పించారు. హీరో మహేష్ బాబు కుటుంబసభ్యులను బండి సంజయ్ పరామర్శించారు.
 

BJP Telangana President Bandi Sanjay PaysTribute to hero Krishna
Author
First Published Nov 16, 2022, 1:38 PM IST


హైదరాబాద్: హీరో కృష్ణ బౌతికకాయానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారంనాడు నివాళులర్పించారు. హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.భయమనే పదాన్ని కృష్ణ తన జీవితం నుండి తొలగించారన్నారు.సాహసమే ఊపిరిగా జీవితాంతం కృష్ణ బతికారన్నారు. పినీ రంగంలో కృష్ణ అనేక ప్రయోగాలు చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు.తెలుగు వెండితెరకు సాంకేతికత అనే రంగులను కృష్ణ అద్దారని బండి సంజయ్ కొనియాడారు.మానవత్వం ఉన్న మంచి మనిషి కృష్ణ అని బండి సంజయ్ చెప్పారు.నిర్మాతలను ఆదుకున్న వ్యక్తిగా కృష్ణకు పేరుందన్నారు.వివాదాలకు దూరంగా కృష్ణ కటుంబం ఉండేదన్నారు.క్రమశిక్షణకు కృష్ణ మారుపేరన్నారు.


మంగళవారంనాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ మరణించాడు.కృష్ణ పార్థీవ దేహన్నినిన్న ఉదయమే  నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరించారు. ఇవాళ  ఉదయం పద్మాలయా స్టూడియోకి కృష్ణ పార్థీవదేహన్నితరలించారు. అభిమానుల సందర్శనార్ధం స్టూడియోలో మధ్యాహ్నం వరకు ఉంచుతారు. 

నిన్న పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీదేహనికి నివాళులర్పించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ,ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు. గుండెపోటు రావడంతో కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ నిన్నతెల్లవారుజామున మృతి చెందాడు. 

alsoread:పద్మాలయ స్టూడియో వద్ద బారికేడ్లు తోసుకొచ్చిన అభిమానులు,ఉద్రిక్తత: పోలీసుల లాఠీచార్జీ

హీరో మహేష్ బాబు కటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన కొద్ది రోజులకే తల్లి ఇందిరాదేవి మరణించింది.తల్లి మరణించిన రెండునెలల్లోపుగానే హీరో కృష్ణ మృతి చెందాడు.రమేష్ బాబు మరణానికి రెండేళ్ల ముందే  హీరో  కృష్ణ సతీమణి విజయనిర్మల కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios