Asianet News TeluguAsianet News Telugu

జైలుకెల్లాల్సిన ఉత్తమ్‌ను పార్లమెంటుకా? ఇది టీఆర్‌ఎస్ పనే: లక్ష్మణ్

తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. బిజెపి జాతీయాద్యక్షుడు లక్ష్మణ్ అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని...అతన్ని జైలుకు పంపుతామని టీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. ఆ తర్వాత వారిమధ్య లోపాయికారి ఒప్పందం జరగడంతో అప్పుడు  జైలుకు పంపుతామన్న పార్టీయే ఇప్పుడు పార్లమెంట్ కు వెళ్లడానికి సహకరించింది. నల్గొండలో ఉత్తమ్ టీఆర్ఎస్ అండతోనే గెలిచాడని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

bjp state president laxman sensational comments on uttam
Author
Hyderabad, First Published May 28, 2019, 7:45 PM IST

తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. బిజెపి జాతీయాద్యక్షుడు లక్ష్మణ్ అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని...అతన్ని జైలుకు పంపుతామని టీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. ఆ తర్వాత వారిమధ్య లోపాయికారి ఒప్పందం జరగడంతో అప్పుడు  జైలుకు పంపుతామన్న పార్టీయే ఇప్పుడు పార్లమెంట్ కు వెళ్లడానికి సహకరించింది. నల్గొండలో ఉత్తమ్ టీఆర్ఎస్ అండతోనే గెలిచాడని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో బిజెపి పాగా వేస్తుందన్న భయం ఉత్తమ్ కు పట్టుకుందన్నారు. అందువల్లే అతడు బిజెపి గెలుపును తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఉత్తమ కుమార్ ప్రగల్బాలు పలకడం మానేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి దిగజారిపోయిందో చూసుకోవాలని సూచించారు.  ఓటమి అంచుల్లో నిలిచినా కాంగ్రెస్ నాయకులు ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా  నిలిచే సత్తా ఒక్క  బిజెపికి మాత్రమే వుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 38 శాతం బిజెపికే వచ్చాయని గుర్తేచేశారు. విద్యావంతులంతా బిజెపికి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణలో ఏకంగా నాలుగు సీట్లు గెలిచి తమ సత్తా ఏంటో చాటామన్నారు. ఏకంగా సీఎం కూతురు కవితను నిజామాబాద్ లో, ఆయన  కుడిభుజం వినోద్ కుమార్ ను కరీంనగర్ లో ఓడించి గట్టి హెచ్చరికలు పంపాం. ఇకపై ఇలాంటి షాక్ లు టీఆర్ఎస్ కు మరిన్ని అందిస్తామని లక్ష్మణ్ తెలిపారు. 

ఇప్పటికే తమ జాతీయాధ్యక్షులు తెలంగాణపై గురి పెట్టారని...అతి త్వరలో ఆ ఫలితాలు కనిపిస్తాయన్నారు. తెలంగాణలో భవిష్యత్ మొత్తం బిజెపిదేనని...కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios