బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్  లక్ష్మణ్ తన దీక్షను విరమించారు. శుక్రవారం నాడు నిమ్స్‌లో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగరాం డాక్టర్ లక్ష్మణ్‌కు  నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.


హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన దీక్షను విరమించారు. శుక్రవారం నాడు నిమ్స్‌లో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగరాం డాక్టర్ లక్ష్మణ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకొన్న అవకతవకలను నిరసిస్తూ డాక్టర్ లక్ష్మణ్ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్షకు దిగిన లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నిమ్స్‌కు తరలించారు.

నిమ్స్‌లో కూడ డాక్టర్ లక్ష్మణ్ తన దీక్షను కొనసాగించారు. డాక్టర్ లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ, షుగర్ కూడ పడిపోయింది. శుక్రవారం నాడు బీజేపీ అగ్రనేతలు డాక్టర్ లక్ష్మణ్‌ను దీక్ష విరమింపజేసేలా ఒప్పించారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగరాం లక్ష్మణ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశాడు.