హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు  కరోనా సోకింది. చికిత్స నిమిత్తం ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.పార్టీ కార్యక్రమాల్లో మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల కాలంలో చురుకుగా పాల్గొన్నారు.  అనారోగ్యం సోకడంతో  ఆయన  పరీక్షలు చేయించుకొన్నాడు. కరోనా సోకిందని తేలింది.

 దీంతో  ఆయన చికిత్స కోసం సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో  రాష్ట్రంలో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో సేకండ్ వేవ్ నమోదైన తర్వాత  ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం  ఇదే ప్రథమం.