హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్  విమర్శలు గుప్పించారు. ఇద్దరు చంద్రుల ఫ్రంట్‌లకు అవకాశం లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

సోమవారం నాడు ఆయన  హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇద్దరు చంద్రులు ఫెడరల్ ఫ్రంట్‌, ఫ్యామిలీ ఫ్రంట్‌‌కు టెంటు లేదని లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఒకాయన అడవి బాట పడితే.. మరొకరు  ఢిల్లీ, కోల్‌కత్తా సమావేశాలకు లక్ష్మణ్ విమర్శించారు.

టీడీపీని చంద్రబాబునాయుడు సోనియాగాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు.  కేసీఆర్ బొంగరం కూడ తిప్పలేరని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండూ ఒక్కటేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రగ్రహణం వీడనుందన్నారు. ఏపీలో ఓటమికి చంద్రబాబునాయుడు సాకులు వెతుకుతున్నారని లక్ష్మణ్ విమర్శలు చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరింత మంది బీజేపీ వైపు వస్తారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలో ఎగ్జిట్‌ పోల్‌ను మించి మాకు సీట్లు వస్తాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.