Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ అప్పుడు అలా అని ఇప్పుడు మాట మారుస్తావా : బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

 తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను, సీఎం కుడిభుజం కరీనంగరర్ ఎంపీ  వినోద్ ను సైతం ఓడించామని చెప్పుకొచ్చారు. వారిని గెలిపించుకోలేకపోయిన స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రభంజనం ప్రారంభమైందంటే అది తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తోందని చెప్పుకొచ్చారు. 

bjp president lakshman comments on trs
Author
Hyderabad, First Published May 28, 2019, 7:53 PM IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ సత్తా ఏంటో నిరూపించామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించి తామేంటో నిరూపించుకోగలిగామన్నారు. 

హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను, సీఎం కుడిభుజం కరీనంగరర్ ఎంపీ  వినోద్ ను సైతం ఓడించామని చెప్పుకొచ్చారు. వారిని గెలిపించుకోలేకపోయిన స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. 

ఉత్తర తెలంగాణలో ప్రభంజనం ప్రారంభమైందంటే అది తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తోందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఉత్తర తెలంగాణ ఓ దిక్సూచి అన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతోోపాటు ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. 

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఉత్తర తెలంగాణయే నాంది పలికిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపును చిన్నదిగా చూపించేలా కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. 

టీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రజలు సహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు దేశంలో మోదీ హవాలేదని విమర్శించిన కేటీఆర్‌ ఇప్పుడు తెలంగాణలో మోదీ హవా వల్లే బీజేపీ గెలిచిందని మాట మార్చారంటూ విరుచుకుపడ్డారు. 

దేశవ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌లలో కూడా బీజేపీయే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. మోదీ పాలన కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని స్పష్టం చఏశారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కానీ లేని నావలా తయారౌందన్నారు. 

19 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో ఒక స్థానానికే పరిమితమైందని చెప్పుకొచ్చారు. ఇకపై తమ దృష్టంతా తెలంగాణ వైపేనని, టార్గెట్‌ తెలంగాణ అని అమిత్‌షా అన్నారని లక్ష్మణ్‌ వెల్లడించారు. తెలంగాణలో తమ యుద్ధం ప్రారంభమైందని, రాబోయే కాలంలో రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios