బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 15న తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. పర్యటనలో భాగంగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 15న తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. పర్యటనలో భాగంగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మెుదట పార్టీ జాతీయ నాయకులతో సమావేశం కానున్న అమిత్ షా ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. 

ఆ తర్వాత ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా ఇంఛార్జ్‌లు, అధ్యక్షులతో సమావేశమై పార్టీ గెలుపుకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. 
అనంతరం మధ్యాహ్నం మహబూబ్ నగర్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా ప్రసగించనున్నట్లు లక్ష్మ ణ్ తెలిపారు.