Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్: ఉత్తరాది కోటాలో రాజ్యసభకు ఏపీ,తెలంగాణ నేతల పేర్ల పరిశీలన

ఉత్తరాది కోటాలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది.ఈ విషయమై రెండు రాష్ట్రాల నుండి నేతల పేర్లను కమల దళం పరిశీలిస్తుంది.

BJP Plans To Select Two candidates From Telugu states To Rajya Sabha
Author
Hyderabad, First Published May 23, 2022, 10:27 PM IST


హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో BJP ని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కేంద్రీకరించింది. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నేతలకు ఉత్తరాది రాష్ట్రాల నుండి రాజ్యసభకు పంపాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతల పేర్లను కమల దళం పరిశీలిస్తుంది.

2023లో Telangana లో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తుంది. Amit Shan  తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. Praja Sangrama Yatraను ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి పూర్తి చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. జూన్ లో మూడో విడతను ప్రారంభించనున్నారు.  మూడో విడత పూర్తి చేసిన తర్వాత నాలుగో విడతను కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ  నుండి  మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, గరికపాటి మోహన్ రావు, విజయశాంతిలలో ఎవరో ఒకరికి రాజ్యసభ సీటు కట్టబెట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుందని సమాచారం. మరో వైపు Andhra Pradesh రాష్ట్రంలో కూడా మాజీ కేంద్ర మంత్రులు పురంధేశ్వరీ, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లలో ఎవరో ఒకిరికి ఈ రాజ్యసభ చాన్స్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల కోటా తెలుగు రాష్ట్రాల నేతలను రాజ్యసభకు పంపనున్నారు.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుండి ఒక్కొక్కరి చొప్పును రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారు.ఒకవేళ రాజ్యసభకు పంపడం సాధ్యం కాకపోతే రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయాలని కూడా కమల దళం ప్లాన్ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

also read:ఆ విషయంలో చర్చకు సిద్దమా?: మంత్రి బొత్స సత్యనారాయణకు సోము వీర్రాజు సవాలు..

దక్షిణాదిలో బలపడాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే కర్ణాటకలో బీజేపీ సక్సెస్ అయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ పోకస్ పెట్టింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో తెలంగాణపై బీజేపీ పట్టును పెంచుకొనే ప్రయత్నాలు చేస్తుంది.  ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దూకుడుగా విమర్శలు చేస్తుంది. ఇతర పార్టీల నుండి కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

మరో వైపు ఏపీలో జనసేనతో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది., అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios