Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 90 అసెంబ్లీ స్థానాలు టార్గెట్: హైద్రాబాద్‌లో రెండు రోజులుగా బీజేపీ విస్తారక్‌ల భేటీ

తెలంగాణతో పాటు  దక్షిణాది  రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై  బీజేపీ ఫోకస్ పెట్టింది.  దక్షిణాదిలో  అధిక  ఎంపీ స్థానాలతో పాటు  తెలంగాణలో  90 అసెంబ్లీ స్థానాలే లక్ష్యంగా  బీజేపీ  వ్యూహరచన చేస్తుంది.  ఈ మేరకు రెండు రోజుల పాటు విస్తారక్ సమావేశంలో  వ్యూహరచన చేస్తుంది. 

BJP  Plans To  get  90 assembly segments from Telangana in  2023 Elections
Author
First Published Dec 29, 2022, 12:59 PM IST

హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో  పార్టీని  బలోపేతం  చేసే విషయమై  బీజేపీ ఫోకస్ పెట్టింది.  తెలంగాణలో  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  90 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని  ఆ పార్టీ   లక్ష్యంగా  ముందుకు వెళ్లనుంది. 
ఇందుకుగాను  రెండు రోజులుగా హైద్రాబాద్ శివారులోని శామీర్ పేటలో  బీజేపీ విస్తారక్ ల సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న  ఉదయం ఈ విస్తారక్ ల సమావేశాన్ని   బీజేపీ సంస్థాగత  సహ కార్యదర్శి  సతీష్ ప్రారంభించారు.  దక్షిణ ప్రాంతానికి చెందిన  ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత  ప్రాంతాల నుండి  సుమారు  92 మంది విస్తారక్ లు హాజరయ్యారు.  ఈ ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో  అత్యధిక ఎంపీ స్థానాలను  కైవసం చేసుకొనే వ్యూహాన్ని ఈ సమావేశాల్లో రచిస్తున్నారు.  దక్షిణాదిలో  బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా  తెలంగాణ రాష్ట్రంలో  90 అసెంబ్లీ సీట్లు సాధించేందుకు  అవసరమైన వ్యూహన్ని  బీజేపీ  రచిస్తుంది. దక్షిణాదిలో  ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో  అధికారాన్ని నిలుపుకోవడంతో  పాటు  ఇతర రాష్ట్రాల్లో  కూడా  అధికారాన్ని చేపట్టే దిశగా  వ్యూహాలను ఆ పార్టీ నాయకత్వం  రచిస్తుంది.  

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  అధికారంలోకి రావడం కోసం  బీజేపీ నాయకత్వం  కొంత కాలంగా వ్యూహత్మకంగా  అడుగులు వేస్తుంది.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలకు   బీఎల్ సంతోష్  ఇవాళ  దిశా నిర్ధేశం  చేయనున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  90 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని  పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.  మిషన్  90 పేరుతో  ఏడాది పాటు కార్యక్రమాలను రూపొందించనున్నారు. బీజేపీ నేతలు  బస్సు యాత్ర  నిర్వహించనున్నారు. త్వరలోనే బస్సు యాత్ర  ప్రారంభించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో  90 స్థానాలను గెలుచుకొనే  లక్ష్యంతో  ముందుకు వెళ్లనుంది  ఆ పార్టీ, 45 అసెంబ్లీ స్థానాల్లో  బలహీనంగా  ఉన్న అభ్యర్ధుల స్థానంలో  బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించాలని  ఆ పార్టీ భావిస్తుంది.  ఈ విషయమై  పార్టీ నేతలకు బీఎల్ సంతోష్  దిశా నిర్ధేశం  చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్రీకరించింది.  ప్రధానంగా  తెలంగాణ పై ఆ పార్టీ నాయకత్వం  ఫోకస్ ను మరింత పెంచింది. గత పార్లమెంట్  ఎన్నికల సమయంలో  తెలంగాణలో బీజేపీ  4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.  ఉప ఎన్నికల్లో  హుజూరాబాద్, దుబ్బాకల్లో విజయం సాధించి.  మునుగోడులో  రెండో స్థానంలో నిలిచింది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  30కి పైగా  కార్పోరేటర్లను బీజేపీ గెలుచుకుంది.  దీంతో  కొంత కాలంగా బీజేపీ దూకుడుగా  ముందుకు వెళ్తుంది.  ఈ దూకుడును మరింత  పెంచనుంది. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios