Asianet News TeluguAsianet News Telugu

టైం అయిపోతావుంది... తెలంగాణా బిజెపిలో గాభరా

మోదీ హయాంలో బలపడకపోతే ముందుకు పోవడం కష్టంమని బిజెపి భయపడుతూ ఉంది. టైం అయిపోతాఉందన్న గాభరా పార్టీ లో బాగా కనిపిస్తూ ఉంది. బిజెపి నాయకులు ఎన్నికలకు పనికిరారు, ఇతర పార్టీలో నుంచి తెచ్చుకోవలసిందే. ఇలాంటపుడు పఠాన్ చెరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బిజెపి కి  దొరికాడని  సమాచారం. గౌడ్ ‘రియల్ ’మనిషి. బలమయినోడు, బిజెపి అన్ని విధాల  ఎన్నికల యోగ్యుడు.

bjp opens gates to leaders of other partys in Telangana

 

తెలంగాణాకు అందరికంటే ముందే మద్దతు తెలిపినా, తెలంగాణా మద్దతు పార్లమెంటులో బిల్లును గెలిపించానా, భారతీయ జనతా పార్టీకి తెలంగాణా పెద్దగా గిట్టుబాటేం కాలేదు. ఆ పార్టీ మైనారిటీ పార్టీ ఎంఐఎం కు వచ్చినన్ని ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలుంటే బిజెపికి ఉండేది అయిదుగు. 2014లో పెరగని ఈ సంఖ్య 2019 లోనే లేదా ఇంకా  ముందొస్తులోనే పెగురుతుందన్నా గ్యారెంటీ లేదు. ప్రధాని మోదీ హావా ను ఎలా ఉపయోగించుకోవాలని  ఈ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. తెలంగాణా రాష్ట్రసమితి హవా, రెండోస్థానంలో  కాంగ్రెస్ ఉన్న చోట  మొదటి స్థానంలోకి రావడానికి మోదీ మాయ కంటే మరేదో గొప్ప శక్తి కావాలని బావిస్తున్నది. ఆ శక్తి ఫిరాయింపులు. పదవిలో ఉన్నోళ్లరాకుంటే,పదవుల్లో లేనోళ్లనపయినా పార్టీలోకి లాగి,పార్టీ బలపడుతున్నట్లు చూపాలి. ఇలా ఇతర పార్టీ లనుంచి తెచ్చుకున్నోళ్లు, ప్లస్ ప్రధాని నరేంద్ర మోడీ కలసి పార్టీని వచ్చే ఎన్నికల్లో ముందుకు తోస్తారేమో  ఒకపట్టు పట్టాలని  తెలంగాణా బిజెపి భావిస్తోంది.

 

దీనికి బిజెపి వాళ్లకు  ఒకపుడు పఠాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న నందీశ్వర్ గౌడ్ దొరికాడు. ఆయన్న  ఇది తొలివిజయం గా భావిస్తూ తెలంగాణా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ని  ఢిల్లీ నేతలకు పరిచయం చేసేందుకు దేశ రాజధాని వైపు పరుగు తీశారు. సోమవారం మధ్యహ్నం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ముందు ప్రవేశపెట్టి, కండువా కప్పించే అవకాశం ఉంది. ఇది అమిత్ షా పర్యటనకు ముందు బిజెపి ఘనవిజయంగా చెప్పుకుంటున్నది. నందీశ్వర్ గౌడ్ సిటిలో బాగా బలమయిన రియల్ మనిషి. డబ్బు దస్కం ఉన్నవాడు. ప్రస్తుతం కాంగ్రెస్ లో యాక్టివ్ గాఉన్నవాడు. అలాంటి వ్యక్తులు  పార్టీ రెండు విధాల ప్రయోజనం. ఒకటి ఆయన డబ్బు. రెండు గౌడ్ బిసి.

 

ఇలాంటి నాయకులెక్కడెక్కడ ఉన్నారో ఇపుడు బిజెపి హైదరాబాద్ లో కాగడా వేసి వెదుకుతున్నారు.  వాళ్లందరిని సమీకిరంచి ఈ నెల 23 అమిత్ షా నగరానికి వచ్చినపుడు బిజెపికండువా ఇస్తారు. ఇలాంటి నియోజకవర్గ నాయకులు ఎక్కువగా చేరితే, వచ్చే ఎన్నికలలో కొన్ని సీట్లు గెల్చుకోవచ్చు. (లేదా టిఆర్ ఎస్ పార్టీలో పొత్తుకు వెళితే కొన్ని సీట్లు ఎక్కువ డిమాండ్ చేసుకోవచ్చు. టిఆర్ ఎస్ తో పొత్తు ఉంటుంది బిజెపిలోని ఒక సెక్షన్ బలంగా నమ్ముతూఉంది.)

 

మొత్తానికి పార్టీ నాయకులు ఎన్నికలకు పనికిరారని,  ఇతర పార్టీ లనుంచి తెచ్చుకోవడమేనని బిజెపి ఇపుడు బలంగా నమ్ముతూ ఉంది. ఇందులో భాగంగా లక్ష్మణ్ పలువురు మున్నూరు కాపు నాయకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా వకిషన్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్, టిడిపిలకు చెందిన మాజీ ఎమ్మెల్యే రెడ్ల తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

 

నరేంద్ర  హయాంలో బలపడకపోతే, ఇక ముందుకు పోవడం కష్టంమని బిజెపి భయపడుతూ ఉంది. టైం అయిపోతాఉందన్న గాభరా పార్టీ లో బాగా కనిపిస్తూ ఉంది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios