జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నాయకులు.. కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. బాలానగర్, ఫతేనగర్, డివిజన్లకు చెందిన నాయకులు ఆఫీసును ధ్వంసం చేశారు.

కిషన్ రెడ్డి, హరీశ్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

అటు టీఆర్ఎస్‌ పార్టీలో సైతం అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో మూసాపేట్ టీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్ యాదవ్ అనుచరులతో కలిసి తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు.

ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినా తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఒత్తిడితోనే తనకు టికెట్ దక్కలేదని మల్లేశ్ నిరసన వ్యక్తం చేశారు.