బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రాబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉన్నది. రేపు మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. సాయంత్రం నాగర్ కర్నూల్‌లో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. 

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో లుకలుకలపై వార్తలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. జేపీ నడ్డా రేపు తెలంగాణకు రాబోతున్నారు. ఈ పర్యటనకు ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. జేపీ నడ్డా సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి హిట్ చేయాలని బీజేపీ భావిస్తున్నది. ఈ సభతోనైనా బీజేపీ క్యాడర్‌లో నిరుత్సాహం తేలిపోయి ఉత్తేజం పొంగాలని ఆశిస్తున్నది.

జేపీ నడ్డా ప్రపోజల్ షెడ్యూల్ ఖరారైంది. నాగర్ కర్నూల్‌లో జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన రేపు మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, ఆయన సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం అవుతారు. వీరితో భేటీ మధ్యాహ్నం 1.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగుతుంది. ఈ ఇద్దరు ఎవరనేది ఇప్పటికైతే స్పష్టత లేదు.

అనంతరం, మధ్యాహ్నం 3.00 గంటలకు ఆయన నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. ఒక గంటపాటు ఆ హోటల్‌లోనే జేపీ నడ్డా ఉంటారు. అనంతరం, సాయంత్రం 4.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ సభకు వెళ్లుతారు. ఒక అరగంటలో అక్కడికి చేరుకుంటారు.

Also Read: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిలా రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?

నాగర్ కర్నూల్‌లో జెడ్‌పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంారు. అనంతరం, 6.10 గంటలకు అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. అరగంటకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.40 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం నగరానికి వెళ్లుతారు.