జేపీ నడ్డాకు పోలీసుల నోటీసులు.. నా హక్కుల్ని అడ్డుకోలేరు, సికింద్రాబాద్ వెళ్లి తీరతానన్న బీజేపీ చీఫ్
తాము ర్యాలీ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలతోనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్తామని నడ్డా పేర్కొన్నారు
తాము ర్యాలీ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలతోనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్తామని నడ్డా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తానని జేపీ నడ్డా అన్నారు. తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని.. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో వున్నాయని చెప్పారని ఆయన వెల్లడించారు. అనంతరం జేపీ నడ్డాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మరోవైపు ప్రజల ఆరోగ్యం, ఒమిక్రాన్ (omicron) కేసుల వ్యాప్తిని నిరోధించేందుకే జేపీ నడ్డా (jp nadda) ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు హైదరాబాద్ పోలీసులు (hyderabad police) స్పష్టం చేశారు. ఈ మేరకు నగర పోలీసులు ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు.
ALso Read:జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ.. కారణమిదే : నార్త్ జోన్ డీసీపీ క్లారిటీ
ఇటీవల బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్ తో రాష్ట్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నిరసనలు తలపెడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర నాయకులు పోలీసులను అనుమతి కోరగా హైదరాబాద్ పోలీసులు నిరాకరించారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, జేపీ నడ్డా ర్యాలీ అనుమతి నిరాకరించిన విషయం మీడియాకు తెలియజేశారు.
కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఎక్కువగా జనాలు గుమ్మిగూడి ఉండే ప్రదేశాలు కావటంతో కరోనా వ్యాప్తి ప్రబలుతుందనే ఉద్దేశ్యంతో ర్యాలీకి అనుమతి నిరాకరించామని అని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి ఉత్తర్వులలో పేర్కొన్నారు.