కేసీఆర్ ఈడీ విచారణను ఎదుర్కోక తప్పదు: బీజేపీ నేత మురళీధర్ రావు సంచలనం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడీ విచారణను ఎదుర్కోక తప్పదని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు చెప్పారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో కూడా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR త్వరలోనే Enforcement Directorate విచారణను ఎదుర్కోక తప్పదని BJP మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు చెప్పారు.
సోమవారం నాడు bjp Muralidhar Rao హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.ఈడీ, ఐటీ దాడుల విషయంలో బీజేపీ జోక్యం చేసుకోదని ఆయన తేల్చి చెప్పారు.
TRS లోనే చాలా అసమ్మతి ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లో ఉండే వాళ్లు ఎదురు తిరగక ముందే ఇతర పార్టీలపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ అసమ్మతి బయట పడుతుందన్నారు.
సిద్దిపేట ప్రజలు కూడా టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో తాను ఈ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో తాను గమనించిన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. సిద్దిపేట ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా టీఆర్ఎస్ అమలు చేయలేదన్నారు. ఈ విషయమై సిద్దిపేట చౌరస్తాలో తాను చర్చకు సిద్దమన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడలతో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్టరంలో కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు గాను బీజేపీపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధరల పెరుగుదలపై కేసీఆర్ చేస్తున్న అసత్యాలపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని బీజేపీ నేత మురళీధర్ రావు చెప్పారు. పక్క దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో సంక్షోభంలోకివెళ్లే అవకాశాలు లేవన్నారు.
ఆర్ధికవేత్తలతో కూడా బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఇతర దేశాల కరెన్సీ తో పోల్చుకుంటే రూపాయి విలువ తక్కువ తగ్గిన మాట వాస్తవమేనన్నారు. ఫెడరల్ బ్యాంక్ ఇంటరెస్ట్ పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
1990 లో 2003 లో వచ్చిన ఆర్ధిక సంక్షోభం లొకి మన దేశం వెళ్లదని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇటీవలనే మాజీ ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను మురళీధర్ రావు ప్రస్తావించారు.
కరోనా కారణంగా భారత్ సహా పలు దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. దేశ ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని చెప్పారు. కెసీఆర్, కేటీఆర్ కు ఎకనామిక్స్ రాదని ఆయన ఎద్దేవా చేశారు.
NITI AYOG సమావేశాన్ని బహిష్కరించేందుకు పలు కారణాలను తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పలువురు బీజేపీయేతర పార్టీల సీఎంలు పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కెసీఆర్ లేవనెత్తిన అంశాలను ఇతర బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.
నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చించినట్టుగా మురళీధర్ రావు గుర్తు చేశారు.
క్రాప్ డైవర్సిటి పై చర్చించారన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఉండి ఉంటే ఈ విషయమై చర్చించే అవకాశం ఉండేదన్నారు. రాబోయే రోజుల్లో రైతులు క్రాప్ డైవర్సిటి పై చర్చించక తప్పదన్నారు.
జీఎస్టీ పై కూడా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధాని మోడీని దూషించడంతో రాష్ట్ర ప్రజలు కెసీఆర్ ను తప్పు బడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. .బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ లను అమ్ముతున్నారని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమ్మితే ప్యాకేజ్ ఎందుకు ఇస్తారని మురళీధర్ కేసీఆర్ ను ప్రశ్నించారు.
బోధన్ సుగర్ ఫ్యాక్టరీ నీ ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న షేర్స్ ను తగ్గించుకోవడం అంటే అమ్మడం కాదన్నారు. ఎన్ పీ ఏ పై కూడా కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. లోన్ రికవరీ లో 8.5 లక్షల కోట్లను నరేంద్ర మోడీ చేసిందన్నారు. సంక్షేమ పథకాలకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.గత నాలుగు ఏళ్లు సహకరించిన కేసిఆర్ ఎందుకు మోడీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారో చెప్పాలని అడిగారు